| అరకు ఆంధ్రప్రదెశ్ లోని విహార ప్రదేశాలలొ ప్రముఖమైనది.ఎటు చూసినా ఆహ్లాదపరిచే ప్రకృతి,ఆహ్లాదపరిచే కొండ కోనలు,జల జల పారే జలపతాలు అరకు సొతం.అందుకే ఈ ప్రాంతాన్ని ఆధ్రా ఊటీగా పిలుస్తారు. అరకు వ్యాలీ మన రాష్ట్రంలోని విశాఖపట్నానికి 115 కిలో మీటర్ల దూరంలో ఒరిస్సా బొర్డర్ సమీపంలో ఉంది.అరకు చుట్టూరూ తూర్పు కనుమలు విస్తరించి ఉన్నయి.అరకు సముద్ర మట్టానికి 600-900 మీటర్ల ఎత్తులో ఉంది.46 బ్రిడ్జ్ లను దాటుకుంటూ ఇరువైపులా విస్తరించి ఉన్న దట్టమైన కొండల నడుమ అరకును చేరుకోవడం ఒ మరపురాని అనుభవం.ఇక్కడ ఎక్కువగా గిరిజనులు నివశిస్తారు.వారి ఆచార సాంప్రదాయాలు,కొయ నృత్యాలు మనం అక్కడ చూడవచ్చు.ఈ ప్రాంతంలో ఎక్కువగా కాఫీ తోటలను సాగు చేస్తారు.
 అరకు చుట్టూ చూడవలసిన ప్రదేశాలు -
 
 ట్రైబల్ మ్యుజియం -
 అరకులో ఏర్పాటు చేసిన ట్రైబల్ మ్యూజియంలొ గిరిజనులకు సంభందించిన వస్తువులని,వారి చిత్రాలను చూడవచ్చు.
 అనంతగిరి హిల్స్ -
 తూర్పు కనుమలు చుట్టూ విస్తరించి ఉన్న అందమైన అనంతగిరి హిల్స్ ని మనం చూడవచ్చు.
 దిసా డ్యాన్స్ -
 గిరిజనులు చెసె దింసా డ్యాన్స్ ని మనం ఇక్కడ చూడవచ్చు
 బొర్రాగుహలు -
 అరకులో ఉన్నటువంటి బొర్రా గుహలు సహజ సిద్దంగా ఏర్పడినటువంటివి.ఈ గుహలు భారతదేశంలో పెద్ద గుహల్లొ ఒకటిగా పేరుగాంచాయి.అరకుకు వచ్చిన ప్రతీ ఒక్కరూ వీటిని చూడటానికి వస్తారు.
 అరకు ఎంత దూరం ఎలా వెళ్ళాలి ?
 వివిధ ప్రాంతాలనుండి అరకు దూరం కిలోమీటర్లలో
 విశాఖపట్నం నుండి - 114 కిమీ
 రాజమండ్రి నుండి - 330 కీమీ
 విజయవాడ నుండి - 530 కీమీ
 హైదరాబాద్ నుండి - 880 కీమీ
 
 
 |