Home
Wallpapers
Movie Zone
Kids Zone
Tourist Guide
Feedback
SPECIAL
SPECIAL
 
Vemulawada raja rajeshwara swamy

వేములవాడ రాజరాజేశ్వర స్వామి

చరిత్ర

     పురాతత్వ ఆధారాలను బట్టి వేములవాడ పశ్చిమ చాళుక్యుల రాజధాని అని తెలుస్తున్నది. క్రీ.శ. ఎనిమిదో శతాబ్దంలో నిర్మించబడ్డ ఈ ఆలయానికి ఆనాటి వేములవాడ చాళుక్యరాజు మొదటి నరసింహుడికి గల “రాజాదిత్య” అనే బిరుదు నుంచి రాజరాజేశ్వరాలయం అనే పేరు వచ్చిందని భావిస్తున్నారు.

     చారిత్రాత్మకంగా వేములవాడ క్షేత్రం అతిసనాతనమైనదని, చాళుక్యుల కాలంలో ఈ క్షేత్రం మహిమాన్వితంగా వెలుగొందినట్లు పరిశోధకుల అంచనా. క్రీ.శ. 750 నుంచి 973 వరకు సుమారు 220 సంవత్సరాలు వేములవాడ చుట్టుపక్కల ఆలయాల నిర్మాణం సాగినట్లు తెలుస్తున్నది.

వేములవాడలోని మరికొన్ని ఆలయాలు -

శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం కాక వేములవాడలో సీతారామచంద్రస్వామి, అనంతపద్మనాభస్వామి, త్రిపురసుందరి, కేదారేశ్వర, భీమేశ్వరస్వామి, వడ్డెగేశ్వరస్వామి ఆలయాలున్నాయి. గండదీపం, ఉత్సవ మూర్తుల అద్దాల మహలు, నాగిరెడ్డి మండపం ప్రధానాలయానికి అనుబంధంగా వున్నాయి.

ఎట్లా వెళ్లాలి

వేములవాడ కరీంనగర్‌కు 36 కిమీల దూరంలో కరీంనగర్‌ - కామారెడ్డి దారిలో ఉంటుంది. హైదరాబాద్ నుంచీ, కరీంనగర్ నుంచీ ఎక్స్ ప్రెస్ బస్సులు చాలా నడుస్తుంటాయి.

వసతి సౌకర్యం

దేవస్థానం కల్పిస్తున్న వసతి సౌకర్యం ఉన్నది.

                                                                 వెల్లంపల్లి అవినాష్

Page 1 2
Vemulawada Temple Photo Gallery