Home
Wallpapers
Movie Zone
Kids Zone
Tourist Guide
Feedback
SPECIAL
SPECIAL
 
Telugu Chandassu

తెలుగు చంధస్సు

    పద్య లక్షణాలు తెలిపెడి శాస్త్రమును ఛందోశాస్త్రము పిలుస్తారు.పద్యాలను వ్రాయడానికి ఉపయోగించే విధానాన్నిఛందస్సు అంటారు.గురు,లఘువులు కలయికచే ఏర్పడేవి గణాలు.ఇటువంటి కొన్ని గణముల కలయిక వలన పద్యము ఏర్పడుతుంది.గురువుని U తోనూ లఘువుని | తోనూ సూచిస్తారు.

లఘువులు - ఏక మాత్రాకాలంలో ఉచ్చరించబడే దానిని లఘువు అని అంటారు.(మాత్ర అనగా చిటికె వెయునంత కాలము)
హ్రస్వాచ్చులు అన్నీ లఘువులు
ఉదా - ఆ,ఇ,ఉ,ఎ,ఒ
హ్రస్వాచ్చులతో కూడిన హల్లులు లఘువులు.
ఉదా - క,చి,టు,తె,పొ
హ్రస్వమయున సమ్యుక్తాక్షరాలు లఘువులు.
ఉదా - స్వ,క్ష్మి,త్రి,క్త మెదలయునవి
హ్రస్వమయున ద్విత్వాక్షరాలు లఘువులు.
ఉదా - గ్గ,మ్మ,క్క మెదలయునవి
వట్ర సుడి గల హ్రస్వాక్షరములు లఘువులు.
ఉదా - సృ,తృ,కృ మెదలయునవి

గురువులు - ద్విమాత్రా కాలములో ఉచ్చరించబడే దానిని గురువులు అని అంటారు.
దీర్ఘాలన్నీ గురువులు
ఉదా - ఆ,ఈ,ఊ,ఏ,ఓ,ఐ
ధీర్గాచ్చులుతో కూడిన హల్లులన్నీ గురువులు.
ఉదా - సై,కా,తే,చీ
విసర్గతో కూడిన అక్షరములు గురువులు.
ఉదా - త:,దు:,అ:
సున్నా (ం) కూడిన అక్షరాలు అన్నీ గురువులు.
ఉదా - అం,కం,యం,రం
సంయుక్తాక్షరం ముందు ఉన్నవన్నీ గురువులు
ఉదా - లక్ష్మి,పద్మ
ద్విత్వాక్షరమునకు ముందున్నవన్నీ గురువులు
ఉదా - అమ్మ,అక్క,పువ్వు
పొల్లు హల్లులో కూడిన వర్ణములు గురువులు
ఉదా - ఖ,ఘ,ఛ,ఝ

Page 1 2 3 4

తెలుగు వ్యాకరణం

తెలుసుకోవలసిన విషయాలు