Home
Wallpapers
Movie Zone
Kids Zone
Feedback
SPECIAL
SPECIAL
 
kolattam
కోలాటం
kolattam,kolattam songs in telugu,andhrapradesh|kolattam dance,kolatam songs in kannada,kolatam songs in telugu,kolattam nrutyam,kolattam sticks
  

   కోలాటం చాలా ప్రాచీనమైన కళ.కోలా అంటే కర్ర ఆట అనగా ఆడుట లేదా నృత్యం చెయ్యుట అని అర్ధం వస్తుంది.కోలాటం అనేది ఒక సాంప్రదాయక సామూహిక నృత్యం ముఖ్యంగా ఉత్సవాల సమయంలో ఈ కళని ప్రదర్శిస్తారు.ఈ నృత్యంలో ఇద్దరూ లేదా అంత కంటే ఎక్కువ మంది కర్రలు ధరించి పాటలను ఆలపిస్తూ లయబద్దంగా నృత్యం చేస్తూ ఒకరి కర్రని మరొకరు కొడుతూ చూట్టూ తిరుగుతారు.ఈ కోలాట బృందానికి ఒక నాయకుడు ఉంటాడు.ఆయననే గురువు అని అంటారు.ఈ వ్యక్తి మద్యలో ఉంటాడు.కోలాటంలో అవతలి వాని కర్రకొట్టు వానిని రాముడు అని అంటారు.కోలాటంలో 50 వరకూ కోపులు ఉన్నాయి.
    కోలాటం భజన బృందంలో ఎక్కువగా స్త్రిలు,యుక్త వయస్సు వచ్చిన వారుంటారు.కోలాట బృందానికి సూచనలిచ్చే గురువు మరియు వాయిద్య కళాకారుల మద్యలో ఉండగా కోలాటం ఆడే సభ్యులు వృత్తాకారంలో ఉంటారు.గురువు చరణాన్ని పాడగా ఆ చరణాన్ని ఆందుకుని మిగతా సభ్యులు వృత్తాకారంలో తిరుగుతూ లయబద్దంగా ఒకరి కర్రని మరొకరు కొడుతూ పాడెదరు.కోలాటంలో ప్రతి పాటకీ"ఎత్తుగడ","ఉసి"మరియు "ముక్తాయింపు" ఉండును.
    కోలాట భజన కేవలం మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా వివిధ పేర్లతో వ్యాపించి ఉంది.దీనిని గుజరాతీ భాషలో "దాండియా"అని రాజస్ధానిలో"గర్భ" అని అంటారు.ఈ కళ చాలా ప్రాచీనమైనదిగా లభ్యమయిన శిలాశాసనాల ద్వారా తెలుస్తుంది.స్త్రిలు కోలాటం ఆడుతున్నట్టు భారతదేశంలోని చాలా ప్రాచిన ఆలయాలపై శీల్పాలుగా చెక్కబడి ఉన్నాయి.అంతేకాకుండా ఈ కోలాటం నృత్యం గురించి తిక్కన,శ్రీనాధుడు వంటి కవులు తమ తమ రచనలల్లో ప్రాస్తావించాడు.అన్నమయ్య వేంకటేశ్వరుని ఆయన దేవేరులపై కోలాట నృత్యంపై అనేక సంకిర్తనలు రచించాడు.తిరుమల తిరుపతి దేవస్ధానం ఈ కళను రక్షించేందుకు కోలాటంపై ఆశక్తి కలవారికి శిక్షణ ఇచ్చి పలు గ్రామాల్లో కోలాట భజనలు నిర్వహింపచేస్తుంది.

Page 1
జానపద కళలు
   గరగ నృత్యం వీధి నాటకాలు
   పిచ్చి కుంట్ల వారు కోలాటం
   హరి కధ
గంగిరెద్దు మేళం
   చెక్క భజన బుట్ట బొమ్మలు
   బుడబుక్కల వాడు బతుకమ్మ నృత్యం
   యక్షగానం
   మన చరిత్ర ఆంద్రప్రదేశ్ విశేషాలు
   మన రాష్ట్ర చిహ్నాలు ఆంద్రప్రదేశ్ ప్రత్యేకతలు
   మన కవులు
మన జానపదకళారూపకాలు
   మన చారిత్రక కట్టడాలు మన ప్రముఖ వ్యక్తులు
   మన ముఖ్యమంత్రులు మన గవర్నర్స్
   మన రాజకీయ పార్టీలు మన రాష్ట్ర మంత్రులు
   ముఖ్యమయున ఫోన్ నెంబర్స్ యస్.టి.డి కోడ్స్
   వాహన రిజిస్ట్రేషన్    కోడ్స్ మన విశ్వవిద్యాలయాలు
ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమయిన సమాచారం
  ఆంధ్రప్రదేశ్ జిల్లాలు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్లు
  ఆంధ్రప్రదేశ్ లోక్ సభ   నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు
  ఆంధ్రప్రదేశ్ మండలాలు ఆంధ్రప్రదేశ్ గ్రామాలు
Feedback - [email protected]