Home
Wallpapers
Movie Zone
Kids Zone
Feedback
SPECIAL
SPECIAL
 
Kobbari rice

కొబ్బరి రైస్

కావలసిన పదార్ధాలు -
కొబ్బరి చిప్పలు - 2
బియ్యం - అరకిలో
జీలకర్ర,ఆవాలు - రెండు టీస్పూన్స్
పచ్చిమిరపకాయలు - 6
ఎండుమిర్చి - 4 కాయలు
అల్లం ముక్కలు - 1 టేబుల్ స్పూన్
కరివేపాకు - రెండురొబ్భలు
వేరుశనగ గుళ్ళు - 1 టేబుల్ స్పూన్
జీడి పప్పు - 1 టేబుల్ స్పూన్
నిమ్మకాయ - 1
ఉప్పు - తగినంత
తయారుచేయు విధానం - ముందుగా అన్నం వండి పక్కన ఉంచుకోవాలి.తరువాత కొబ్బరి చిప్పలను కోరుకోవాలి.ఆ తర్వాత స్టౌమీద మూకెడ ఉంచి నూనెపోసి కాగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు,అల్లం,కరివేపాకు,వేరు శనగగుళ్లు,జీడిపప్పు,ఎండుమిర్చి కలిపి వేయించుకోవాలి.బాగా వేగిన తర్వాత కోరి ఉంచుకున్న కొబ్బరి తురుము వేసి వేయించుకోవాలి.ఇది కొంచేం వేగిన తర్వాత అన్నం వేసి దానిలో కొంచెం ఉప్పు కలిపి బాగా కలియబెట్టాలి.దించే ముందు నిమ్మకాయ పిండుకుంటే పుల్లపుల్లగా రుచిగా ఉంటుంది.
Page 1